: ఆర్టీసీకి కనీస గిట్టుబాటు ధర లభించడం లేదు: ఆర్టీసీ ఎండీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి... ఆర్టీసీ పరిస్థితి ఒకేలా ఉందని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలకు కనీస గిట్టుబాటు ధర దొరకటం లేదని ఆయన ఆవేదన చెందారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సమ్మెలు, బందుల వల్ల రూ.2,233 కోట్లు ఆర్టీసీ నష్టపోయిందన్నారు. పదో తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు మూడున్నర లక్షల మంది ఆర్టీసీ సేవలు ఉచితంగా వినియోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో నడుపుతోన్న బస్సుల వల్ల లాభాలు వస్తున్నప్పటికీ... పల్లె వెలుగు బస్సుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీని ఆదుకునే విషయంలో ప్రజలు కూడా ఆలోచించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News