: అండర్సన్ ను గేలి చేసిన ఇండియన్ ఫ్యాన్స్
టెస్ట్ సిరీస్‌లో రవీంద్ర జడేజాను అసభ్యపదజాలంతో దూషించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను టీమిండియా అభిమానులు గేలి చేశారు. మూడో వన్డేలో బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న అండర్సన్‌ను చూసి స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ అతణ్ణి వెక్కిరించారు. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ జిమ్మీని వారు అదే పనిగా అవహేళన చేస్తూ... వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. కాగా, లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్‌లో జడేజా బ్యాటింగ్ చేసేందుకు వచ్చినప్పుడు ఇంగ్లండ్ ఫ్యాన్స్ కూడా ఇలాగే వెక్కిరించారు.