: ఎక్కువమంది విజయవాడ-గుంటూరునే రాజధానిగా కోరుకుంటున్నారు: శివరామకృష్ణన్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఎంపిక చేసేందుకు తాము జరిపిన అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది విజయవాడ-గుంటూరుకే ఓటు వేశారని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంపై ఏప్రిల్ 22నుంచి కమిటీ సలహాలు స్వీకరించడం మొదలుపెట్టింది. కమిటీకి మొత్తం 4,728 లేఖలు, ఈ-మెయిళ్లు వచ్చాయి. ఇందులో 1,156 మంది విజయవాడ-గుంటూరు కలిపి ఏపీ రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. కేవలం విజయవాడను మాత్రమే రాజధానిగా 663 మంది కోరుకున్నారు. అలాగే 372 మంది గుంటూరు మాత్రమే రాజధాని కావాలని ఆశించారు. మొత్తంగా చూసుకుంటే విజయవాడ-గుంటూరుల పరిధిలో రాజధాని ఉండాలని 2,191 మంది మొగ్గుచూపారు. విశాఖపట్టణం రాజధానిగా ఉండాలని 507 మంది కోరుకున్నారు. ఇక తిరుపతిని రాజధాని చేయాలని 113 మంది ఆకాంక్షించారు. రాజధాని రేసులో విజయవాడ-గుంటూరుతో దాదాపు సరిమానంగా నిలిచిన దొనకొండ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలన్న వారి సంఖ్య కేవలం 116 గా మాత్రమే ఉంది.

  • Loading...

More Telugu News