: విస్తారంగా వర్షం ... రైతన్నల ఆనందం!


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గత రెండుమూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లోని రైతులు కళ్లలో వత్తులు పెట్టుకుని వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సరైన సమయంలో వరుణదేవుడు రైతాంగాన్ని కరుణించాడు. ఈ వర్షాలతో తెలంగాణ జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, చెఱకు పంటలు వేసిన రైతులకు ఊరట కలిగింది. అలాగే, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మెట్ట, వర్షాధార పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఇవి కురవడం ఇంకాస్త ఆలస్యమయినట్టయితే ఖరీఫ్ సాగు తీవ్రంగా నష్టపోయేది.

  • Loading...

More Telugu News