: మూడో వన్డేలో భారత్ ఘన విజయం


నాటింగ్ హామ్ లో జరిగిన భారత్ - ఇంగ్లండ్ మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ పై 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచి... ఐదు వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 227 పరుగులకు ఆలౌట్ అవ్వగా, భారత్ 43 ఓవర్లలోనే 228 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. అంబటి రాయుడు (63 నాటౌట్), రహానే 45, రైనా 42, విరాట్ కోహ్లి 40 పరుగులతో రాణించారు. జడేజా 12 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వోక్స్, ఫిన్, స్టోక్స్, ట్రెడ్ వెల్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News