: మూడో వన్డేలో తొలి వికెట్ కోల్పోయిన భారత్
ఇంగ్లండ్ తో నాటింగ్ హామ్ లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. వోక్స్ ఈ వికెట్ ని తీశాడు. రహానే 21, విరాట్ కోహ్లి 2 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత్ ముందు ఇంగ్లండ్ 228 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెలిసిందే.