: ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు


ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడటంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తా, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. మెంటాడలో 10 సెం.మీ., బొండేపల్లి 8, పాడేరులో 8 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గజపతి నగరం 7, ఎస్.కోట 6, పార్వతీపురంలో 6 సెం.మీ. వర్షం కురిసింది. అరకు, వేపాడ, పలాస, నెల్లిమర, గంట్యాడ, టెక్కలిలో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో 1 నుంచి 4 సెం.మీ. వర్షం కురిసింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల 1 నుంచి 5 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. శ్రీశైలంలో 6, కర్నూలు, ఆత్మకూరు 1 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డు అయ్యింది.

  • Loading...

More Telugu News