: ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్


ఏపీఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 11 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. సమ్మెకు సంబంధించిన గోడ పత్రికను విజయవాడలో ఆవిష్కరించారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన 775 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈయూ ప్రతినిధులు కోరారు.

  • Loading...

More Telugu News