: స్నేక్ గ్యాంగ్ ను వదలొద్దు: బీజేపీ
హైదరాబాద్ లోని పాతబస్తీ పహడీ షరీఫ్ లో ఎన్నో దారుణాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, బీజేఎంవై నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులు గచ్చిబౌలి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. కాగా, రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు స్నేక్ గ్యాంగ్ ను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిపై మరో ఐదు కేసులు నమోదు చేశారు. వీరి దురాగతాలపై పోలీసులు సమగ్ర విచారణ చేశారని సమాచారం.