: టీకాంగ్ నేతలకు ఫోన్ చేసి మరీ హెచ్చరించిన సోనియా గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేశారు. తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు పొన్నాల, జానారెడ్డి, రాజనర్సింహ, గీతారెడ్డి, ముత్యంరెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితర నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేశారు. మెదక్ లో విజయం సాధించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని నేతలను సోనియా టీకాంగ్ నేతలను హెచ్చరించారు.