: రెండో వన్డేలో కోట్ల రూపాయల బెట్టింగ్ కు పాల్పడుతున్న బుకీ అరెస్టు


ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో... కార్డిఫ్ లో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఓ బుకీ బుక్కయ్యాడు. స్టేడియంలో ఉండి బంతి బంతికీ ల్యాప్ ట్యాప్ ద్వారా వివరాలు అందిస్తున్న ఓ వ్యక్తిని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్టు చేశారు. అతని కదలికలు, బంతి బంతికీ ఏదో సమాచారం టైప్ చేస్తూ ఉండడంతో అతని వ్యవహార శైలిని అనుమానించారు. ఈ క్రమంలో అధికారులు పరిశీలించగా అతను బుకీ అని తేలింది. దీంతో, అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తాను బెట్టింగ్ కంపెనీలో పని చేస్తున్నానని, రెండో వన్డే సందర్భంగా కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగిందని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో, బెట్టింగ్ పై అతనిని మరింత లోతుగా విచారించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కాగా, ఇంగ్లండ్ లో బెట్టింగ్ చట్టబద్ధమే. దీంతో, అతనిని ఐసీసీ శిక్షించగలుగుతుందా? అనేది అనుమానమే.

  • Loading...

More Telugu News