: స్నేహం-ప్రేమ వలకు మోసపోయిన 24 మంది అమ్మాయిలు


స్నేహం పేరుతో వల విసురుతారు, ఐస్ క్రీం పార్లర్లు, సినిమాలు, షికార్లు, పండగలు, పబ్బాలు అంటూ గిఫ్టులు ఇస్తారు. నెమ్మదిగా స్నేహం ఉచ్చును బిగిస్తారు. స్నేహంలో అన్నీ మామూలే అంటారు... గట్టిగా అడిగితే ప్రేమ అంటారు... ఇంకాస్త గట్టిగా ప్రశ్నిస్తే పెళ్లి అంటారు... ఈ లోపే కూల్ డ్రింకుల్లో మత్తు పదార్థాలు కలుపుతారు. సీన్ కట్ చేస్తే... ఆ అమ్మాయిలు సామూహిక అత్యాచారానికి గురవుతారు. ఆ ఘనకార్యం బ్లూఫిల్మ్ గా రూపుదిద్దుకుంటుంది. ఇక అప్పట్నుంచి బ్లాక్ మెయిలింగ్ పర్వం మొదలవుతుంది. సదరు కీచకులకు కోరిక కలిగినా, ఆర్ధిక అవసరం పడినా ఆ అమ్మాయి మరోసారి బలవుతుంది. ఇలా 24 మంది అమ్మాయిలను, విజయవాడలో పట్టుబడిన సాయిబాబు బ్లూఫిల్మ్ గ్యాంగ్ మోసం చేసింది. వీరి బారిన పడిన వారు చాలామంది ఉన్నప్పటికీ, ముందుకు వచ్చేందుకు వారు సంశయిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వీరి బారిన పడి ఓ యువతి 4 లక్షల రూపాయలు ముట్టజెప్పినప్పటికీ ఆమెను వదలకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో వీరి గుట్టురట్టయింది.

  • Loading...

More Telugu News