: రైతులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం: చాడ


రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, మెదక్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లోను మద్దతు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. విద్యుత్ కోతలతో రైతులను, ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులపాలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని ఆయన సూచించారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చాడ చెప్పారు. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ... మండలానికో, నియోజకవర్గానికో ఒకరికి ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. హరిజనులు, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News