: సెప్టెంబర్ 5 'టీచర్స్ డే' కాదు...గూరూత్సవ్: పాలనలో మోడీ స్టాంప్
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ... పాలనలో ప్రతీ చిన్న విషయంపై కూడా తనదైన స్టాంప్ వేస్తున్నారు. ఈ విషయాన్ని నిరూపించే సంఘటన ఒకటి నిన్న జరిగింది. సాధారణంగా సెప్టెంబర్ 5న మనం టీచర్స్ డేగా జరుపుకుంటాం. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పటివరకు సెప్టెంబర్ 5ను ‘టీచర్స్ డే’గానే ప్రభుత్వ వర్గాలు వ్యవహరించడం ఆనవాయతీగా వస్తోంది. అయితే నిన్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన సర్క్యూలర్ లో టీచర్స్ డే కాస్త 'గురూత్సవ్'గా మారిపోయింది. రాధాకృష్ణన్ 126వ జయంతిని గురూత్సవ్ -2014గా వ్యవహరించాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు. గురూత్సవ్-2014ను పురస్కరించుకుని 23 భాషల్లో ప్రభుత్వం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తోంది.