: గవర్నరుగా ఐదో ఏడాది ఖైరతాబాదుకు వచ్చా: నరసింహన్
గవర్నరుగా ఐదో సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఇవాళ ఉదయం సతీసమేతంగా ఖైరతాబాద్ కైలాస విశ్వరూప గణపతిని దర్శించుకున్నారు. 60 అడుగుల విఘ్నేశ్వరుడికి తొలి పూజ నిర్వహించారు. వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుంటే సర్వ విఘ్నాలు తొలగిపోతాయని గవర్నర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.