: కాణిపాకంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొజ్జల
కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. 21 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా... ఇవాళ వినాయక వ్రతం నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని తెల్లవారు జామున 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఏకదంతుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు.