: వినాయక బకెట్ ఛాలెంజ్ చేద్దాం: యాంకర్ ఝాన్సీ


యాంకర్ ఝాన్సీ వినాయక బకెట్ ఛాలెంజ్ ను మన ముందుకు తీసుకువస్తున్నారు. వెబ్ ప్రపంచంలో దుమారం రేపుతున్న ఐస్ బకెట్ ఛాలెంజ్ లా మనమూ ఓ కొత్త ఛాలెంజ్ ప్రారంభిద్దామని ఆమె చెప్పారు. మన ఇంట్లో పూజించిన గణపతిని మన వాకిట్లోనే శాస్త్రోక్తంగా ఓ బకెట్ నీటిలో నిమజ్జనం చేద్దామన్నారు. ఒక గంటలో విగ్రహం కరిగిపోతే ఆ నీటిని మొక్కలకు పోసి, అడుగున ఉన్న మట్టిని తులసి కోటలోనో, పూల మొక్కల్లోనే వేసుకోవాలని ఝాన్సీ సూచించారు. ఈ బకెట్ నిమజ్జనం ఫోటోని కానీ, వీడియో కానీ ఫేస్ బుక్ లోనో, యూ ట్యూబ్ లోనో అప్ లోడ్ చేయండని ఆమె చెప్పారు. ఈ బకెట్ నిమజ్జనంతో మన చెరువులను కాపాడుకునే ప్రయత్నం చేద్దామని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News