: రివాల్వర్ తో కాణిపాకం ఆలయంలోకి ప్రవేశించిన చరణ్ రాజ్
వినాయకచవితి రోజున కాణిపాకం ఆలయంలో మరోసారి సెక్యూరిటీ లోపాలు బట్టబయలు అయ్యాయి. ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ రివాల్వర్ తో ఈ ఉదయం ఆలయంలోకి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో... రివాల్వర్ తోనే లోపలికి వెళ్లి కాణిపాక వినాయకుడి దర్శనం చేసుకున్నాడు. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన వినాయకచవితి పర్వదినాన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఏమరుపాటుగా ఉండడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. భద్రతాసిబ్బంది అప్రమత్తంగానే ఉన్నారని... చరణ్ రాజ్ ఎటువంటి ఆయుధాలు గుడిలోపలకి తీసుకురాలేదని వారు చెబుతున్నారు.