: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్ వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల కూడా శుభాకాంక్షలు తెలిపారు.