: అక్కినేని జ్ఞాపకార్థం త్వరలో పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్న అమెరికా
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్ లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో అక్కినేని పోస్టల్ స్టాంప్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 17న గుడివాడలో అక్కినేని కుటుంబసభ్యుల సమక్షంలో జరిగే అంతర్జాతీయ అక్కినేని అవార్డుల కార్యక్రమంలో కూడా ఈ స్టాంప్ ను విడుదల చేయనున్నారు. అక్కినేని షౌండేషన్ ఆఫ్ అమెరికా (ఎఎఫ్ఏ) చేసిన కృషి ఫలితంగా అక్కినేనికి ఈ గౌరవం దక్కింది.