: ఇకపై అధికారికంగా కాళోజీ జయంత్యుత్సవాలు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంత్యుత్సవాలను ఇకపై అధికారికంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సెప్టెంబరు 9న జరిగే కాళోజీ శతజయంతి నాడు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ రోజున వరంగల్ లో రవీంద్ర భారతి కంటే పెద్దదైన కళా, సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కళా కేంద్రంలో కాళోజీ రచనలు, ఆయన జ్ఞాపకాలను భద్రపరుస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.