: జగన్ కేసులపై మరోసారి విచారణ జరగాలి: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల


వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ పై ఉన్న కేసులపై మరోసారి విచారణ జరగాలని అసెంబ్లీలో పట్టుపడతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ అసెంబ్లీలో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. శాసనసభలో మర్యాద లేకుండా జగన్ అహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. సమస్యలపై సమగ్రమైన చర్చ జరిగితే తమ ఉనికికే ప్రమాదమని జగన్ గ్రహించారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News