: రుణమాఫీపై రైతులను చంద్రబాబు మభ్యపెడుతున్నారు: ఎంపీ మేకపాటి
రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మభ్యపెడుతున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మాట్లాడుతూ, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ‘ప్రధాని జన్ ధన్ యోజన’ కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. శాసనసభలో స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. స్పీకర్ కోడెల హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు.