: గ్రాముల్లో పట్టుబడే మత్తుపదార్థాలు... అక్కడ టన్నుల్లో బయటపడ్డాయి!


గ్రాముల్లో పట్టుబడే మత్తుపదార్థాలు ఒక్కసారిగా టన్నుల్లో బయటపడితే 'వామ్మో' అని నోరెళ్లబెట్టాల్సిందే. లాటిన్ అమెరికాలోని పెరూలో టన్నుల కొద్దీ పట్టుబడిన కొకైన్ పోలీసులను విస్మయానికి గురి చేసింది. దక్షిణ అమెరికా, యూరప్ లోని బెల్జియం, స్పెయిన్ వంటి దేశాలకు సరఫరా చేసేందుకు సిద్ధం చేసిన 3.3 టన్నుల కొకైన్ ను అమెరికా పోలీసుల సహకారంతో పెరూ పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్ వేటలో ఇద్దరు మెక్సికన్లు, ఐదుగురు పెరూవియన్స్ ను పోలీసులు పట్టుకున్నారు. భారీ ఎత్తున జరుగుతున్న ఈ కొకైన్ సరఫరా వెనుక మెక్సికన్ డ్రగ్ ముఠాల హస్తం ఉండే అవకాశం ఉందని పెరూ పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు వెలుగుచూస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News