: సురేష్ రెడ్డి నివాసంలో భేటీ అయిన టీఎస్ కాంగ్రెస్ నేతలు
శాసనసభ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మెదక్ ఉప ఎన్నికలో విజయ బావుటా ఎగురవేయడానికి అవసరమైన కార్యాచరణపై వీరు చర్చించారు. అంతే కాకుండా, తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై కూడా చర్చలు జరిపారు. ఈ వివరాలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీడియాకు తెలిపారు.