: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై హత్య కేసు


పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, మరో 20 మందిపై ఆ దేశ ప్రభుత్వం హత్య కేసు నమోదు చేయనుంది. ఈ ఏడాది జూన్ 17న లాహోర్ లోని మోడల్ టౌన్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మతపెద్ద తాహిర్ ఉల్ ఖాద్రి మద్దతుదారులు పధ్నాలుగు మంది హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో షరీఫ్, పలువురి పాత్ర ఉందంటూ లాహోర్ హైకోర్టులో అప్పట్లోనే పిటిషన్ దాఖలైంది. విచారించిన కోర్టు షరీఫ్ సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇంతవరకు కేసు నమోదు కాకపోవడంతో తాజాగా ఖాద్రి నేతృత్వంలోని పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ (పిఏటి) డిమాండ్ చేసింది. ఆ క్రమంలోనే పాక్ ప్రభుత్వం కేసు నమోదుకు అంగీకరించింది.

  • Loading...

More Telugu News