: మూకీ సినిమాకు ఓకే చెప్పిన వెంకటేష్!


విభిన్నమైన పాత్రలతో అభిమానులను అలరించే టాలీవుడ్ హీరోల్లో వెంకటేష్ ది ప్రత్యేక స్థానం. ఇప్పుడా వెటరన్ హీరో మరో విలక్షణ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పిల్ల జమిందార్ తో ఓ మోస్తరు హిట్ కొట్టిన జి. అశోక్ దర్శకత్వంలో ఓ మూకీ సినిమా చేసేందుకు వెంకీ అంగీకరించాడట. ఈ విషయాన్నిదర్శకుడు జి. అశోక్ ధ్రువీకరించాడు. నేడు ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూకీ సినిమా తీసేందుకు నిర్మాత సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News