: జన్ ధన్ యోజన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ జన్ ధన్ యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా తొలిరోజు కోటి మందికి బ్యాంకు ఖాతాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధార్ అనుసంధాన ఖాతాలకు రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించారు. జన్ ధన్ పథకంలో పేదలకు డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా సౌకర్యం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 76 కేంద్రాల్లో జన్ ధన్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.