: రాజకీయాల్లోకి వస్తానంటున్న వీవీఎస్ లక్ష్మణ్


మణికట్టు మాంత్రికుడు, టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. మంచి అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. ప్రాజెక్టు 511 సంస్థ, హెచ్ఆర్టీఏ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు లక్ష్మణ్ బహుమతులు ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హైదరాబాదులోని లింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఈ హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్ మన్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. రాజకీయాల్లోకి వెళతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, మంచి అవకాశం లభిస్తే రాజకీయాల్లో చేరే విషయం ఆలోచిస్తానని తెలిపాడు. ఇక, విద్యార్థులకు సలహా ఇస్తూ, కష్టపడి చదివితేనే జీవితంలో పైకెదుగుతారని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News