: ఖైరతాబాద్ 'గణపతి'కి కమర్షియల్ టచ్
వాణిజ్య ప్రకటనల విస్తృతి చివరికి దేవుళ్ళనూ వదలడం లేదు. హైదరాబాదు నగరంలోని ఖైరతాబాదులో కొలువైన నిలువెత్తు గణపతి విగ్రహం చుట్టూ వాణిజ్య ప్రకటనలు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విగ్రహం ఉంచిన మండపం చుట్టూ ఉన్న ఫ్రేమ్ కు ఐడియా సెల్యులర్ ప్రకటనల స్టిక్కర్లు అంటించారు. దీనిపై, భక్తులు స్పందిస్తూ, దేవుళ్ళ విగ్రహాల వద్ద ఇలాంటి వాణిజ్య ప్రచారం కూడదని సూచించారు. ఈ యాడ్స్ వ్యవహారంపై ట్విట్టర్లో పలువురు సెటైర్లు విసిరారు. "ఇంకా నయం, దేవుడి విగ్రహం మీదే యాడ్స్ అతికించలేదు!" అంటూ ట్వీట్లు వదిలారు.