: 'రామా... సీత ఎక్కడ?' టీవీ సీరియల్ పై భజరంగ్ దళ్ ఆగ్రహం
జీ తెలుగు చానల్లో ఈ వారమే ఆరంభమైన 'రామా... సీత ఎక్కడ?' సీరియల్ చిక్కుల్లో పడింది. ఈ సీరియల్ పేరు మతవిశ్వాసాలను కించపరిచేదిగా ఉందంటూ భజరంగ్ దళ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాకుండా, వీహెచ్ పీ కార్యకర్తలతో కలిసి భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాదులోని టీవీ చానల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. చివరికి, టీవీ చానల్ అధికారులు సీరియల్ పేరు మార్చేందుకు అంగీకరించడంతో నిరసనకారులు వెనుదిరిగారు.