: అతను చనిపోలేదు... లవర్ తో జంప్ అయ్యాడు!
జనాలు తెలివి మీరిపోయారు... నచ్చిన జీవితం కోసం ఏమి చేసేందుకైనా వెనుకాడడం లేదు. ఆర్టీఐ కార్యకర్త, ఆమ్ ఆద్మీపార్టీ నేత చనిపోయినట్లు పోలీసులను నమ్మించి, తప్పించుకు తిరుగుతున్న చంద్రమోహన్ శర్మను గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యలపై గళమెత్తినందుకే కక్షగట్టిన ప్రత్యర్థులు అతనిని అంతమొందించారని శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. శర్మ మరణించినట్లు చెబుతున్న రోజునుంచే పొరుగున ఉండే ఓ యువతి కూడా కనిపించకుండా పోవడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. కనిపించకుండా పోయిన యువతి ఫోన్ నంబర్ను ట్రేస్ చేయగా ఆమె బెంగళూరులో ఉన్నట్లు సమాచారమందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు చంద్రమోహన్ శర్మను చూసి అవాక్కయ్యారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.