: నటుడి అవతారమెత్తిన 'డేరా బాబా'


గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా ఓ విలక్షణ వ్యక్తి. పంజాబ్ లోని 'డేరా సచ్చా సౌధా' మతాధిపతిగా ఈయన చాలా ఫేమస్. పోయినేడాది ఉత్తరాఖండ్ వరదల్లో భర్తలను కోల్పోయిన మహిళలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని, అందుకోసం వారికి తన భక్తులతో వివాహాలు జరిపిస్తానని చెప్పి వార్తల్లోకెక్కాడీ బాబా. ఇటీవలే డేరా బాబా రాక్ స్టార్ అవతారమెత్తి పలు కచేరీలు కూడా నిర్వహించారు. తాజాగా, తన ప్రతిభాపాటవాలను సినీరంగంవైపు మళ్ళించారు. ఈ క్రమంలో డేరా బాబా ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పైనున్న ఆ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మలయాళంలో కొన్ని సినిమాలు, హిందీలో పలు సీరియళ్ళలో నటించిన ఓ తార కీలక పాత్ర పోషిస్తోందట. ఈ సినిమాకు జీతు అరోరా దర్శకుడు. 'క్యోంకీ సాస్ భీ కభీ బహూ తీ' తో పాటు పలు హిట్ సీరియళ్ళకు అరోరా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ఆరు పాటలనూ డేరా బాబానే రాసి, ఆలపించడం విశేషం. పైగా, దర్శకత్వంలోనూ ఓ చేయివేశాడట. మరి ఆ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో, లేదో, చూడాలి!

  • Loading...

More Telugu News