: చర్చి హిందూ దేవాలయంగా మారింది!


ఉత్తరప్రదేశ్ లోని ఓ చర్చి కాస్తా హిందూ దేవాలయంగా రూపాంతరం చెందింది. ఈ ప్రార్థనామందిరంలో ఏసుభక్తులుగా కొనసాగుతున్న 72 మంది వాల్మీకి కులస్తులు తిరిగి హిందూమతాన్ని స్వీకరించారు. అలీగఢ్ కు 30 కిలోమీటర్ల దూరంలోని అస్రోయి గ్రామంలోని చర్చిలో ఈమేరకు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చర్చిలోని శిలువను తొలగించి శివుడి చిత్రపటాన్ని గోడకు తగిలించారు. కాగా, ఈ వాల్మీకులు 1995లో క్రైస్తవంలోకి ప్రవేశించారు. స్థానిక ధర్మ్ జాగరణ్ వివాద్ సంఘ్ ప్రచారక్ ఖేమ్ చంద్ర మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని 'ఘర్ వాప్సీ' (పూర్వపు మతంలోకి తిరిగిరావడం) గా పిలుస్తామని తెలిపారు. ఇది 'మతమార్పిడి' కాదని స్పష్టం చేశారు. వారిష్టప్రకారం క్రైస్తవమతంలోకి వెళ్ళారని, ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారని, అందుకే తిరిగి హిందూమతాన్ని స్వీకరించారని ఖేమ్ చంద్ర వివరించారు.

  • Loading...

More Telugu News