: వచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా కోస్తా ప్రాంత వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, తెలంగాణ ప్రాంతంలో కూడా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.