: వంగవీటి రాధ, రోజాకు పదవులు


వైఎస్సార్సీపీలో వివిధ పదవులను భర్తీ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధినేత జగన్ తాజాగా మరికొన్ని పదవులకు నియామకాలు జరిపారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గొల్ల బాబూరావులను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా... మేకతోటి సుచరిత, వై.నాగరెడ్డి, అనిల్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, ముద్దునూరి ప్రసాద్ రాజు, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూధన్ రెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజీవ్ కృష్ణ, మేడపాటి వెంకట్, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు నియమితులయ్యారు. అలాగే, వైకాపా ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం అధ్యక్షుడిగా వంగవీటి రాధా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజా, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎమ్వీఎస్ నాగిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మేరుగ నాగార్జున, బీసీ సెల్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాసు, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అంజాద్ బాషా, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బాలరాజు, ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతం రెడ్డిలను జగన్ నియమించారు.

  • Loading...

More Telugu News