: పీవీకి 'భారతరత్న'ను సిఫార్సు చేయాలని నిర్ణయించిన టీఎస్ సర్కార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన పద్మ అవార్డుల సిఫార్సు కమిటీ సమావేశం ముగిసింది. కమిటీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ... తీవ్ర చర్చోపచర్చల తర్వాత తుది జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాను వెంటనే సీఎం కేసీఆర్ కు పంపారు. పద్మ అవార్డులతో పాటు... భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును 'భారతరత్న'కు సిఫార్సు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.