: వినుకొండ-మార్టూరు ఏపీ రాజధానిగా బెస్ట్ ఛాయిస్... తేల్చిచెప్పిన శివరామకృష్ణన్‌ కమిటీ!


కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్‌ కమిటీ సమర్పించబోతోన్న నివేదికలోని కీలక అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివరామకృష్ణన్‌ కమిటీ ఏపీ రాజధానిగా వినుకొండ-మార్టూరును 'బెస్ట్ ఛాయిస్ గా' పేర్కొంది. విజయవాడ-గుంటూరును రాజధానిని చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని కమిటీ సూచించింది. ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే ఆర్థిక పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది. వినుకొండ గుంటూరు జిల్లాలో ఉండగా... మార్టూరు ప్రకాశం జిల్లాలో ఉంది. వినుకొండ-మార్టూరు మధ్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అత్యంత అనుకూలమని కమిటీ తేల్చింది. మార్టూరు-వినుకొండకు మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే జిల్లా కేంద్రం గుంటూరు నుంచి వినుకొండ సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినుకొండకు- మార్టూరుకు మధ్య ఉన్న ముఖ్యనగరం నరసరావుపేట. నరసరావురావు పేటకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వినుకొండ ఉంది. నరసరావుపేట నుంచి మార్టూరుకు మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది.

  • Loading...

More Telugu News