: రైనా సెంచరీ... టీమిండియా 304/6


కార్డిఫ్ వన్డేలో టీమిండియా భారీ స్కొరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 19 పరుగులకే ధావన్ (11), కోహ్లీ (0)ల వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మ(52)కు జత కలిసిన రహానే (41) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ట్రేడ్ వెల్ బంతిని అర్థం చేసుకోలేకపోయిన రహానే స్టంపౌట్ గా పెవిలియన్ బాటపట్టాడు. దీంతో రైనా సహకారంతో రోహిత్ అర్ధసెంచరీ సాధించి వెనుదిరిగాడు. అనంతరం రైనాకు ధోనీ జతకలిశాడు. మంచి సమన్వయమున్న జోడీగా పేరున్న రైనా, ధోనీ టీమిండియాను ఒడ్డున పడేశారు. సాధికారికమైన షాట్లతో విరుచుకుపడిన రైనా 75 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వంద మార్కుకు చేరగానే రైనా అవుటయ్యాడు. దీంతో ధోనీ ఆటలో వేగం పెంచి అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్ (10), జడేజా(9) నాటౌట్ గా నిలవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 304 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ (4), ట్రేడ్ వెల్ (2) రాణించారు. కాగా, ఇంగ్లండ్ విజయలక్ష్యం 305.

  • Loading...

More Telugu News