: ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకున్న టీమిండియా మాజీ కోచ్


టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ (46) కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ స్థాపించారు. దాని పేరు 'గ్యారీ కిర్ స్టెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్'. 'కేప్ ఆఫ్రికా టూర్స్' సహకారంతో గ్యారీ ఈ సంస్థను స్థాపించారు. తన కంపెనీలో పలు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా, కేప్ టౌన్ లోని కిర్ స్టన్ క్రికెట్ అకాడమీలో చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహిక క్రికెటర్లు వస్తున్నారు. ఆ డిమాండ్ కు తగిన విధంగా ఓ సొంత ట్రావెల్ ఏజెన్సీ ఉంటే మేలని ఈ క్రికెట్ గురు భావించినట్టు సమాచారం. అందుకే దీన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, ప్రపంచ క్రికెట్ జట్లను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయా టెస్టు జట్లు దక్షిణాఫ్రికాలో పర్యటించే సమయాల్లో, వారి పర్యటన బాధ్యతలను చేపడితే కాసుల వర్షం కురుస్తుందన్నది గ్యారీ యోచన.

  • Loading...

More Telugu News