: వాళ్లు నా లవర్స్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్... పాత పాట పాడిన అలియా


బాలీవుడ్ యువ తార అలియా భట్ పాత పాటే పాడింది. ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తనపై వస్తున్న పుకార్లపై వివరణ ఇచ్చింది. అర్జున్ కపూర్, వరుణ్ ధావన్ లు తన లవర్స్ కాదని, వారితో తనకు ఎలాంటి అఫైర్లు లేవని స్పష్టం చేసింది. వారిద్దరూ కేవలం తన సహనటులు మాత్రమేనని తెలిపింది. కాగా, సినీ తారలు తల్లుల్ని వెంటపెట్టుకుని వెళ్లడం, తండ్రే తన హీరో అని పేర్కొనడం వింటూనే ఉంటాం. కానీ, ఈ యువనటి ప్రఖ్యాత దర్శకుడు, తండ్రి మహేశ్ భట్ సలహాలను తీసుకోవడానికి అస్సలు ఇష్టపడదట. ఏవైనా సలహాలు తీసుకోవాల్సి వస్తే దర్శకుడు కరణ్ జోహార్ ను సంప్రదిస్తానని అలియా తెలిపింది. కరణ్ జోహార్ సినిమా ద్వారానే అలియా సినీ రంగ ప్రవేశం చేసింది.

  • Loading...

More Telugu News