: మెదక్ మాదే... బీజేపీది దయనీయ స్థితి: పొన్నాల


మెదక్ లోక్ సభ స్థానం తమదేనని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ తమకు పోటీ కాదని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ సదస్సుతో నేతల్లో ఐక్యత పెరిగిందని ఆయన తెలిపారు. మెదక్ ఉప ఎన్నికలో తమ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెదక్ గెలుపోటములకు తనదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఎంపిక విషయంలోనే బీజేపీ దయనీయస్థితి బయటపడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజల్ని మోసం చేయడమే టీఆర్ఎస్ ను విజయానికి దూరం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News