: అవినీతి కేసులో ఐఎంఎఫ్ చీఫ్ పై అభియోగాలు నమోదు


అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎంఎఫ్) అధినేత్రి క్రిస్టీనె లగార్డెపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాకు వెల్లడించారు. 2008లో తాను ఫ్రెంచ్ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న మిలియన్ యూరోల అవినీతి కేసులో నిర్లక్ష్యం వహించారంటూ అభియోగాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం తన విధులకు రాజీనామా చేసే ఆలోచన లేదని క్రిస్టీనె స్పష్టం చేశారు. అయితే, ఆ కేసులో తానెలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఈ నిర్ణయంపై సవాల్ చేయాలని తన న్యాయవాదికి చెప్పానన్నారు.

  • Loading...

More Telugu News