: కోహ్లీ డకౌట్... రోహిత్ అర్ధ సెంచరీ
టీమిండియా మరోసారి పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ లో కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శిఖర్ ధావన్ (11) పేలవ ప్రదర్శనను కొనసాగించగా, కోహ్లీ డకౌట్ తో టెస్టు ప్రదర్శనను కొనసాగించాడు. అనంతరం రోహిత్ శర్మకు అండగా బరిలో దిగిన రహానే (41) నిలకడగా ఆడడంతో టీమిండియా సెంచరీ మార్కును దాటింది. సహచరులు వెనుదిరుగుతున్నా మనో నిబ్బరంతో రోహిత్ శర్మ అర్ధసెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ (50)కు అండగా రైనా (8) ఆడుతుండగా, 26 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓక్స్ (2)రాణించగా, ట్రేడ్ వెల్ (1) సహకారమందించాడు.