: డీఎల్ఎఫ్ కు సుప్రీంకోర్టు భారీ జరిమానా


సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లో వాటాలున్నాయంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. ఇప్పుడు ఆ డీఎల్ఎఫ్ కంపెనీకి సుప్రీం కోర్టు జరిమానా విధించింది. గుర్గావ్ లోని మూడు ప్రాజెక్టుల్లో కస్టమర్లను మోసగించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు డీఎల్ఎఫ్ కంపెనీకి రూ.630 కోట్ల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లు నష్టపోకుండా 630 కోట్ల రూపాయలపై 170 కోట్ల రూపాయల వడ్డీని కూడా చెల్లించాలని కేసు విచారించిన డివిజన్ బెంచ్ తీర్పుచెప్పింది. మూడు వారాల్లోగా 50 కోట్లు, మిగతా 580 కోట్ల రూపాయలను మూడు నెలల్లోగా జాతీయ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News