: తమపై ఆరోపణలను ఖండించిన రాజ్ నాథ్ సింగ్


తనపైన, తన కుటుంబంపైన వస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ అవినీతి కారణంగానే ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లోక్ సభ టికెట్ ను ఇచ్చేందుకు ప్రధాని నిరాకరించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ స్పందిస్తూ, తన కుమారుడిపైన, కుటుంబంపైన వస్తున్న ఆరోపణలు ఎలాంటి ఆధారం లేనివన్నారు. కొన్ని రోజుల నుంచీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా చర్చించానన్నారు. అటు ఈ వ్యవహరంపై ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్ నాథ్ పై వస్తున్న ఆరోపణలు అర్థరహితమని, అవాస్తవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజార్చేందుకే ఇటువంటి వార్తలు సృష్టిస్తున్నారని పీఎంవో కార్యాలయం పేర్కొంది.

  • Loading...

More Telugu News