: బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ రగడ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మళ్లీ రగడ జరిగింది. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగన్ అన్నారు. బీఏసీలో నిర్ణయం మేరకే సమయం కేటాయించామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. దీంతో, ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం ప్రారంభించారు. దీనిపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత వాకౌట్ చేస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు. విపక్షం చేసే వాకౌట్ లను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమయం కేటాయింపుపై స్పీకరుదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. అయితే, ప్రతి దానికి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం సరికాదని యనమల అన్నారు.