: టచ్ స్క్రీన్ ఫోన్ కోసం వివాహితను హత్యచేసిన టెన్త్ క్లాస్ విద్యార్థి


సెల్ ఫోన్ వ్యామోహం ఓ బాలుడిని హంతకుడిగా మార్చింది. కర్ణాటకలో ఓ టెన్త్ క్లాస్ విద్యార్థి టచ్ స్క్రీన్ ఫోన్ కోసం ఓ వివాహితను హత్య చేసిన వైనం నివ్వెరపరుస్తోంది. కోలారు జిల్లాలోని బంగారుపేటకు చెందిన ఈ హంతక బాలుడు ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. వీరి ఇంటి ఎదుట మంజుల అనే వివాహిత నివాసముంటోంది. సహజంగానే ఆమెతో విద్యార్థికి పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లోకి ప్రవేశించి తాగడానికి నీళ్ళు అడిగాడు. నీళ్ళు తెచ్చేందుకు మంజుల వెనుదిరగ్గానే ఆమెపై దాడి చేశాడు. ఆమె నోటిని మూసివేసి బ్లేడుతో గొంతుకోసి దారుణంగా చంపేశాడు. అనంతరం, బీరువాలోని డబ్బు, బంగారు నగలు తీసుకుని బయటికొచ్చేశాడు. చేతులకు రక్తం అంటి ఉండడంతో ఏమైందని స్థానికులు అడగ్గా, బైక్ మీద నుంచి పడ్డానని అబద్ధం చెప్పాడు. అక్కడి నుంచి హోస్పేట, అటునుంచి సేలం వెళ్ళి మిత్రుల దగ్గర తలదాచుకున్నాడు. మంజుల హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ పసిగట్టి సేలంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన మార్కు విచారణ జరిపేసరికి ఎందుకు ఆమెను చంపాడో వెల్లడించాడా బాల కిరాతకుడు. టచ్ స్క్రీన్ ఫోన్ కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని, ఆ నగదు కోసమే ఆమెను చంపానని తెలిపాడు.

  • Loading...

More Telugu News