: గణేశ్ ఉత్సవాల బందోబస్తు కోసం రూ.3 కోట్లు విడుదల
హైదరాబాదులో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేశ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. గణేశ్ ఉత్సవాలకు 25 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. బందోబస్తు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.