: హౌసింగ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్, పీఎన్ బీ


పండుగల సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో వినియోగదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు చేపట్టాయి. కొత్త ఇంటి నిర్మాణ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2 కోట్ల రూపాయల లోపు రుణాలపై వడ్డీ రేటును 10.25 శాతానికి తగ్గిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ) పేర్కొంది. గృహ రుణాల్లోని రెండు రకాల స్లాబ్ లను ఎత్తివేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇకపై ఎంతటి గృహ రుణానికైనా 10.15 శాతం వడ్డీ, మహిళలకు 10.10 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని ఎస్ బీఐ తెలిపింది. వడ్డీరేటులో మహిళలకు కల్పిస్తున్న 0.05 శాతం మినహాయింపును కొనసాగిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది.

  • Loading...

More Telugu News